హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ముమ్మాటికీ లౌకికవాదేనని ఆ పార్టీ సీనియర్ నేత షేక్ అబ్దుల్లా సోహైల్ స్పష్టంచేశారు. పొరపాటున చేసిన చిన్న వ్యాఖ్యపై కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మంగళవారం ప్రకటనలో మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి ఏనాడూ మత రాజకీయాల్లో పాలుపంచుకోలేదని, కానీ కాంగ్రెస్ నాయకులు మతపరమైన నేతగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.