Harish Rao | పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా..? రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
Harish Rao | పంద్రాగస్టు లోపు రూ. 39 వేల కోట్ల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా..? అని సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు.
Harish Rao | సంగారెడ్డి : పంద్రాగస్టు లోపు రూ. 39 వేల కోట్ల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా..? అని సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఇంకా రైతుబంధు ఇవ్వనే ఇవ్వలేదు.. కానీ ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడని రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారెంటీలే మీకు భస్మాసురహస్తం అవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అన్నారు. మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు రూ. 2500 సహాయం, కళ్యాణాలక్ష్మి కింద తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను ఓడించాలని హరీశ్‌రావు సూచించారు.
రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని హరీశ్‌రావు విమర్శించారు. నాలుగున్నర నెలల్లోనే ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అంటే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కలేదు.. మీ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారు. మీ పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, హనుమంతరావులే మా సీఎం కలవట్లేదు అని అంటున్నారు. మెడలో పేగులేసుకుంటా, మానవ బాంబునై పేలుతా, డ్రాయర్ ఊడగొడుతా అని సీఎం పదవికి అర్థం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

