జీతాలు పెంచేదిపోయి.. తగ్గిస్తారా?
తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎన్హెచ్ఎం ఉద్యోగుల గురువారం పలు జిల్లాల్లో నిరసనలు చేపట్టారు. సిద్దిపేట, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల్లో ధర్నాలు నిర్వహించారు. వీరి ఆందోళనలకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు సంఘీభావం ప్రకటించారు.
- ఎన్హెచ్ఎం ఉద్యోగులను వెంటనేక్రమబద్ధీకరించాలి
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- మహబూబ్‌నగర్, సిద్దిపేట, మెదక్, నాగర్‌కర్నూల్‌లో ఉద్యోగుల దీక్షలు
మహబూబ్‌నగర్ కలెక్టరేట్/నాగర్‌కర్నూల్/మెదక్ అర్బన్, అక్టోబర్ 15 : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎన్హెచ్ఎం ఉద్యోగుల గురువారం పలు జిల్లాల్లో నిరసనలు చేపట్టారు. సిద్దిపేట, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల్లో ధర్నాలు నిర్వహించారు. వీరి ఆందోళనలకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు సంఘీభావం ప్రకటించారు. సిద్దిపేట కలెక్టరేట్ ఎదు ట నిరవధిక సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు మాజీ మంత్రి హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా శిబిరాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు వేతనాలు పెంచాల్సిందిపోయి.. తగ్గిస్తారా? అని మండిపడ్డారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వీరిని పట్టించుకోవాలని సూచించారు. కరోనా సమయంలోనూ తమ ప్రాణాలను పణం గా పెట్టి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి లక్షలాది మందిని కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు సమ్మె కు మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి, రాష్ట్ర ప్రభు త్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వేతనాలు చెల్లించాలని సూచించారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

