Rajeev Sagar | బీఆర్ఎస్ పాలన రాష్ట్ర రైతాంగానికి స్వర్ణయుగం : మేడే రాజీవ్‌సాగర్
Rajeev Sagar | రైతు రుణమాఫీ పేరుతో రైతుబంధు పథకానికి స్వస్తి పలికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలన రాష్ట్ర రైతాంగానికి సర్ణయుగమని శుక్రవారం విడుదల చేసిన ప్రకనటనలో తెలిపారు.
Rajeev Sagar | హైదరాబాద్ : రైతు రుణమాఫీ పేరుతో రైతుబంధు పథకానికి స్వస్తి పలికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలన రాష్ట్ర రైతాంగానికి సర్ణయుగమని శుక్రవారం విడుదల చేసిన ప్రకనటనలో తెలిపారు. కేసీఆర్ హయాంలో లక్ష కోట్లకుపైగా సంక్షేమం రైతాంగం కోసం ఖర్చు రాష్ట్రం ఖర్చుచేసిందని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు రూ. 72,972 కోట్ల రైతుబంధును, లక్షా 11 వేల రైతు కుటుంబాలకు రూ. 6,488 కోట్ల రైతుబీమా, రెండు విడతల్లో రైతు రుణమాఫీకి రూ. 29,144.61 కోట్లతో సహా ఇత రైతు సంక్షేమపథకాలకు రూ.11.401 కోట్లు ఖర్చుచేసిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందన్నారు. అయితే రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పైచిలుకు రైతులు లక్షలోపు పంట రుణా లు తీసుకుంటే అందులో 11 లక్షల మందికే మాఫీ చేయటం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో లక్ష లోపు రుణమాఫీకి రూ. 19 వేల కోట్లు అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6098 కోట్ల మాత్రమే మాఫీ చేసిందన్నారు. రైతుబంధుకు డబ్బులు ఇంత వరకు రైతుల ఖాతాల్లో సర్కారు జమచేయలేదన్నారు.
మాజీ మంత్రి హరీష్‌రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హకు కాంగ్రెస్ పార్టీకి లేదని రాజీవ్‌సాగర్ స్పష్టం చేశారు. 6 గ్యారెంటీల్లోని 13 హామీలు, రైతు రుణమాఫీ చేస్తే హరీష్‌రావు సవాల్ విసిరితే స్వీకరించే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. 7 మాసాలు గడుస్తున్నా ఒక హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఒక్క రైతురుణమాపీనే తీసుకుంటే రూ. 31 వేల కోట్లలో కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమేననే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకుంటే మంచిదన్నారు. ఆగష్టు 15లోపు 6 గ్యారంటీలు అమలు చేసి మిగతా రూ. 25 వేల కోట్ల రుణ మాఫీ చేసి అప్పుడు హరీశ్‌రావును రాజీనామా విషయంపై మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

