Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు
Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరైంది. క్రిశాంక్‌తో పాటు 9మందికి బెయిల్ మంజూరైందని అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ వెల్లడించారు.
Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరైంది. క్రిశాంక్‌తో పాటు 9మందికి బెయిల్ మంజూరైందని అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ వెల్లడించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు క్రిశాంక్‌పై రాష్ట్రవ్యాప్తంగా 20 కేసులు నమోదయ్యాయి. 2024లో మొదలైన ఈ కేసుల దాడి 2025 సంవత్సరంలో పరాకాష్టకు చేరగా, 2026 నాటికి అది మరింత ఉధృతమైంది. ఒకే సంవత్సరంలో పదికి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం విస్మయానికి గురిచేస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వేధింపులకు పాల్పడుతున్నదో వర్ధమాన దళిత నేత క్రిశాంక్‌పై పెట్టిన కేసుల సెక్షన్లు పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ కేసుల పరంపరలో తాజా ఉదంతం మరింత దారుణంగా ఉన్నది. తన భార్యపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలని, బాధ్యుడైన రాజేంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఇటీవల క్రిశాంక్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. మహిళపై నిరాధార ఆరోపణలు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలిపినందుకు క్రిశాంక్పైనే ఉల్టా కేసు బనాయించారు.
అదే రాజేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు క్రిశాంక్‌తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఏప్రిల్ 24న క్రిశాంక్‌ను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయనను సంగారెడ్డి జైలుకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

