రాష్ట్రంలో కమీషన్ల సర్కార్.. బిల్డర్లను సీఎం బెదిరిస్తున్నరు
రాష్ట్రంలో ప్రాజెక్టులు, పనుల కేటాయింపుల్లో సీఎం రేవంత్రెడ్డి 15 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని, బిల్డర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ)కి నిర్మాణ సంస్థ (ఆర్విఎం కన్స్ట్రక్షన్స్) లేఖ రాసిందని బీఆర్ఎస్ నేత డాక్టర్ మన్నె క్రిశాంక్ సంచలన విషయాన్ని వెల్లడించారు.
- కర్ణాటక తరహాలోనే రేవంత్ పాలన
- బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ట్వీట్
హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తె లంగాణ) : రాష్ట్రంలో ప్రాజెక్టులు, పనుల కేటాయింపుల్లో సీఎం రేవంత్రెడ్డి 15 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని, బిల్డర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ)కి నిర్మాణ సంస్థ (ఆర్విఎం కన్స్ట్రక్షన్స్) లేఖ రాసిందని బీఆర్ఎస్ నేత డాక్టర్ మన్నె క్రిశాంక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ లేఖ ప్రతులను గురువారం ఎక్స్ వేదికగా బయటపెట్టారు. గతంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అకడి కాంట్రాక్టర్లు కమీషన్ల వేధింపులు భరించలేక నేరుగా రాష్ట్రపతికే లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ అవే పరిస్థితులు దాపురించాయని పేర్కొన్నారు.
కర్ణాటక తరహాలోనే ఇకడి కాంగ్రెస్ పాలకులు కూడా కమీషన్ల కోసం కాంట్రాక్టర్లు, బిల్డర్లపై బహిరంగంగా ఒత్తిడి తెస్తున్నారని, రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో దీనిద్వారా స్పష్టమవుతున్నదని విమర్శించారు. కాంట్రాక్టుల బిడ్డింగ్లో పాల్గొనకుండా పలు నిర్మాణ సంస్థలను సీఎంవో నుంచే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పారదర్శకమైన రీటెండరింగ్ నిర్వహించాలని, ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఎలాంటి కమీషన్ల డిమాండ్ లేకుండా తక్షణమే విడుదల చేసేలా ప్రభుత్వంపై బీఏఐ ఒత్తిడి తేవాలని నిర్మాణ సంస్థ విజ్ఞప్తి చేసిందని, కాంగ్రెస్ సరార్లో అర్హులైన కాంట్రాక్టర్లకు అవకాశాలు ఇవ్వకుండా కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

