బీసీల ఆత్మగౌరవానికి దెబ్బ
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ సర్కార్ జీవో-14 తీసుకొచ్చిందని సీనియర్ నాయకుడు రాజారామ్యాదవ్ మండిపడ్డారు. తక్షణమే ఆ జీవో14ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలంటే ఆ పార్టీకి ఎప్పుడూ చిన్నచూపేనని గురువారం ఒక ప్రటకనలో విమర్శించారు. బీసీ కులాల అభివృద్ధికి, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా హైదరాబాద్ ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో వేలకోట్ల విలువైన భూములను బీసీ కుల భవనాల కోసం తొలి సీఎం కేసీఆర్ కేటాయించారని పేర్కొన్నారు.
- జీవో-14తో పెత్తనానికి సర్కార్ కుట్రలు
- తక్షణం ఆ జీవోను రద్దు చేయాల్సిందే..
- బీఆర్ఎస్ సీనియర్ నేత రాజారామ్
హైదరాబాద్, నవంబర్5 (నమస్తే తెలంగాణ): బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ సర్కార్ జీవో-14 తీసుకొచ్చిందని సీనియర్ నాయకుడు రాజారామ్యాదవ్ మండిపడ్డారు. తక్షణమే ఆ జీవో14ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలంటే ఆ పార్టీకి ఎప్పుడూ చిన్నచూపేనని గురువారం ఒక ప్రటకనలో విమర్శించారు. బీసీ కులాల అభివృద్ధికి, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా హైదరాబాద్ ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో వేలకోట్ల విలువైన భూములను బీసీ కుల భవనాల కోసం తొలి సీఎం కేసీఆర్ కేటాయించారని పేర్కొన్నారు.
ఆ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను ఆయా కులాలకే అప్పగించి బీసీల బాంధవుడిగా కేసీఆర్ నిలిచారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత మార్గదర్శకాలను రద్దుచేసి, జీవో14తో నూతన మార్గదర్శకాలను జారీచేసిందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు హైదరాబాద్ భూములన్నింటినీ అక్రమంగా కాజేస్తున్నారని, ఇపుడు ఆయన కన్ను బీసీల ఆత్మగౌరవ భవనాలపై పడిందని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్రెడ్డి జీవో 14ను వెనకి తీసుకోవాలని, లేదంటే బీసీలంతా కాంగ్రెస్ పార్టీని బొందపెడతారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

