Governor Radhakrishnan | యాదాద్రి అద్భుతం.. ఆగమశాస్త్రం ప్రకారం కట్టారు: గవర్నర్ రాధాకృష్ణన్
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఆగమనశాస్త్రం ప్రకారం కట్టారంటూ అభినందించారు. గవర్నర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం రాజ్భవన్లో కలిసిన సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
- కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉన్నది? అడిగానని చెప్పండి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
Governor CP Radhakrishnan | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఆగమనశాస్త్రం ప్రకారం కట్టారంటూ అభినందించారు. గవర్నర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం రాజ్భవన్లో కలిసిన సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని గవర్నర్ ఆరా తీసినట్టు తెలిసింది. ‘కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉన్నది? అడిగానని చెప్పండి’ అని అన్నట్టు సమాచారం.
తాను కూడా యాదగిరిగుట్టను సందర్శించానని, అద్భుతంగా ఉన్నదంటూ గవర్నర్ కొనియాడారని బీఆర్ఎస్ ప్రతినిధులు తెలిపారు. ‘కంగ్రాచ్యులెట్ హిమ్’ అంటూ కేసీఆర్ను ఉద్దేశించి అన్నారని తెలిసింది. కాంగ్రెస్ హామీలు, ప్రొటోకాల్ ఉల్లంఘనలు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై తాము చేసిన ఫిర్యాదుల విషయంలో గవర్నర్ స్పందన బాగున్నదంటూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తంచేసింది. అధికారులను పిలిచి మాట్లాడుతామని హామీ ఇచ్చారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

