KCR | ఓమ్నీ వ్యాన్ నడుపుతూ.. ఎర్రవల్లి పొరుగు గ్రామాలను సందర్శించిన కేసీఆర్.. వీడియో
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడుపుతూ ఎర్రవల్లి పొరుగు గ్రామాలను సందర్శించారు.
KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడుపుతూ ఎర్రవల్లి పొరుగు గ్రామాలను సందర్శించారు. రోడ్లపై కనబడిన వారిని కేసీఆర్ ఆప్యాయంగా పలుకరిస్తూ తన వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. కేసీఆర్ పలుకరింపుతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఓమ్నీ వ్యాన్ స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకుని కేసీఆర్ డ్రైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ నడుస్తున్నారు. అయితే మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ గురువారం నడిపారు. గతేడాది డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ కాలు జారిపడ్డ సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించగా, అది విజయవంతమైంది. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్ సాయంతో బీఆర్ఎస్ అధినేత మెల్లగా అడుగులు వేశారు. ఇక డిశ్చార్జి అయిన తర్వాత కొద్ది రోజులకు కర్ర సాయంతో కేసీఆర్ నడిచారు. లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా కర్ర సాయంతోనే కేసీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తానికి కేసీఆర్ కోలుకోవడంతో.. కొద్ది రోజుల నుంచి కర్ర సాయం లేకుండానే నడవగలుగుతున్నారు. దీంతో మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ గురువారం నడిపారు.
ఎర్రవల్లి పక్కన గ్రామాల్లో స్వయంగా వ్యాన్ నడుపుతూ సందర్శిస్తున్న కేసీఆర్. pic.twitter.com/RFuaT6Xh2D
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

