హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : వెబ్సైట్ తెరుచుకోదు.. అస్సలు ఓపెన్కాదు.. ఇది పాలిసెట్ దరఖాస్తు చేసేందుకు విద్యార్థులు ఎదుర్కొన్న తిప్పలు. డిప్లొమా/పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలయ్యింది. సోమవారం నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని సాంకేతిక విద్యామండలి ప్రకటించింది. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించగా, వెబ్సైట్ ఎంతకు ఓపెన్ కాలేదు. సాంకేతిక సమస్యలు వెంటాడాయి. టెన్త్ హాల్ టికెట్స్ విడుదల కాలేదు.. ఇవి లేకుండా దరఖాస్తు చేసేదేలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కనీసం వెబ్సైట్లో పాలిసెట్ షెడ్యూల్ పొందుపరచలేదు. ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ కావడం లేదు. దీంతో విద్యార్థులు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు రాత్రి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు.
ఏప్రిల్ 13న పాలిసెట్ పరీక్ష
పాలిసెట్ పరీక్షలను ఏప్రిల్ 13న నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యామండలి ప్రకటించింది. వివరాల కోసం www.polyc et.sbtet. telanga na.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. సందేహాలుంటే 08031404549 నంబర్, polycet-te@telangana.gov. in. ఈ మెయిల్‌ను సంప్రదించాలని సూచించారు.
పాలిసెట్ షెడ్యూల్..