బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల తేదీలు ఖరారు
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ | తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఆయా పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. డిగ్రీ, ఎంబీఎ

హైదరాబాద్ : తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఆయా పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. డిగ్రీ, ఎంబీఎ ఎగ్జామ్స్‌తో పాటు బీఎడ్ ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ యూనివర్సిటీ అధికారులు ప్రకటన చేశారు. డిగ్రీ (సీబీసీఎస్ ) 4వ సెమిస్టర్ ఎగ్జామ్స్ జులై 6 నుంచి 8వ తేదీ వరకు, డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలను జులై 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మూడేళ్ల డిగ్రీ కోర్సు పాత బ్యాచ్‌ల పరీక్షలను జులై 16 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహించనున్నారు.
బీఎడ్ ( స్పెషల్ ఎడ్యుకేషన్ ) ప్రవేశ పరీక్షను జులై 18న, ఎంబీఏ ( హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) పరీక్షలను జులై 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షల కోసం రిజిస్ర్టేషన్ చేసుకున్న విద్యార్థులు వర్సిటీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇతర వివరాల కోసం www.braouonline.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

