Brahmanandam | ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. నిట్‌లో సందడి చేసిన బ్రహ్మానందం
Brahmanandam | ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం(Brahmanandam) విద్యార్థులను ఉత్సాహపరిచారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 28: ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం(Brahmanandam) విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ నిట్‌లో(Warangal NIT) స్ప్రింగ్ స్ప్రి 2025 ప్రారంభించి మాట్లాడారు. చాలా పేదరికం నుంచి ఎన్నో అడ్డంకులు, అవహేళనలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి, డా. బీఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం ఎంతో కష్టపడి చదివారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. లెక్చరర్ గా చేసినప్పటికీ నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచించగా సినిమాల్లో నటించే అవకాశం రాగా ఒక్కో అడుగు వేస్తూ ఒడిసి పట్టుకున్నానని తెలిపారు.
నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు గౌరవం ఇస్తారు. కృషి, పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లైఫ్ ఈజ్ ఏ గేమ్.. వి షుడ్ హావ్ టు ప్లే అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. 40 ఏళ్ల సినీ పరిశ్రమలో 1200 పైగా చిత్రాల్లో నటించాను. ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు తీసిన వ్యక్తి గా నిలిచిపోయానని పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు, డాక్టరేట్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాను. అందరూ బ్రహ్మా ‘ఆనందంగా’ఉండాలి, మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచనలు వస్తాయని విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

