తిరుమలగిరి సాగర్, నవంబర్ 29: సాధారణంగా సొరకాయ అడు గు నుంచి అడుగున్నర ఉంటుంది. కానీ నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం పాశం వారిగూడెంలో 4 అడుగుల 7 అంగుళాల సొరకాయ కాసింది.
పాశం వెంకట్రెడ్డి అనే రైతు ఇంట్లో కాత కాసింది. ఎరువులు, పురుగు మందులు వాడలేదు. గతేడాది తమ పొలంలో ఒక్కో దోసకాయ 8 కిలోల వరకు పండిందని వెంకట్రెడ్డి తెలిపాడు.