శ్రీలంకలో ‘గ్రీన్ చాలెంజ్’ను విస్తరిస్తా
తాను పుట్టిపెరిగిన శ్రీలంకలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కృషి చేస్తానని బాలీవుడ్ నటి రాశిప్రభ సందీపని పేర్కొన్నారు. సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె ఆదివా రం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొ క్కలు నాటారు.
- బాలీవుడ్ నటి రాశిప్రభ సందీపని
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తాను పుట్టిపెరిగిన శ్రీలంకలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కృషి చేస్తానని బాలీవుడ్ నటి రాశిప్రభ సందీపని పేర్కొన్నారు. సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె ఆదివా రం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రకృతిని అర్థం చేసుకుంటే ప్రపంచంలో సమస్యలే ఉండవని పేర్కొన్నారు. శ్రీలంకలో ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఇవాళ టూరిజం పెరిగి లక్షల మందికి ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు తగ్గాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమని తెలిపారు. ఇందులో భాగంగానే ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించడం, ఉద్యమంలా ముందుకు తీసుకుపోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను ప్రపంచలోని అనేక దేశాల్లో పర్యటించానని, అనేక మంది పర్యావరణవేత్తలను కలిశానని, కానీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి వినూత్న కార్యక్రమాన్ని ఎక్కడా చూడలేదని స్పష్టం చేశారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించి కోట్లాడి మొక్కలు నాటిస్తున్న ఎంపీ సంతోష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

