ఉత్తరాఖండ్‌లో కంపల్సరీ రిటైర్మెంట్
ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం అకడి ఉద్యోగులపై ఉకుపాదం మోపుతున్నది. అన్‌ఫిట్ సాకు చెప్తూ పదవీ విరమణ చేయాలని బలవంతం చేస్తున్నది.
- ఆర్టీసీ ఉద్యోగులను ఇంటికి పంపుతున్న బీజేపీ ప్రభుత్వం
- మండిపడుతున్న ఉద్యోగులు
- ఎంప్లాయి ఫ్రెండ్లీగా తెలంగాణ సర్కారు
(స్పెషల్ టాస్ బ్యూరో,నమస్తే తెలంగాణ):హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం అకడి ఉద్యోగులపై ఉకుపాదం మోపుతున్నది. అన్‌ఫిట్ సాకు చెప్తూ పదవీ విరమణ చేయాలని బలవంతం చేస్తున్నది. తాజాగా, అక్కడి ఆర్టీసీలో పనిచేస్తున్న 84 మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను తొలగించేందుకు సిద్ధమైంది. మూడు నెలల్లో రిటైర్మెంట్ తీసుకోవాలని, లేకపోతే తామే కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తామని డెహ్రాడూన్, కాఠ్ గోదామ్, టనక్పూర్ ప్రాంతాల్లోని ఆర్టీసీ ఉద్యోగులకు తాఖీదులు పంపింది. ఉద్యోగుల భారాన్ని తగ్గించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ బతుకులను బలి తీసుకొంటున్నదని శాపనార్థాలు పెడుతున్నారు. గతంలోనూ 50 ఏండ్లు నిండిన ప్రభుత్వ ఉద్యోగులకు కంపల్సరీ రిటైర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటికి సాగనంపింది. అదే.. తెలంగాణలో ఎంప్లాయి ఫ్రెండ్లీ సర్కారు నడుస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక ఇంక్రిమెంట్, ఎన్నడూ లేనంత ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల పట్ల ఉదారతను చాటుకొన్నారు. రిటైర్మెంట్ వయసు మరో మూడేండ్లు పెంచారు. అంగన్వాడీల నుంచి ఆయాలు, ఆశవరర్ల వరకు అందరి జీతాలు పెంచారు. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని లాభాల పట్టించేందుకు సంస్కరణలు తీసుకొచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

