బినామీల వెన్నులో వణుకు

ఈటల ఎపిసోడ్లో వారి పాత్రే కీలకం
గండం నుంచి బయటపడేందుకు నిజాలు వెల్లడించే అవకాశం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్‌లోని శ్రీ సీతారామస్వామి దేవాలయ భూములపై విచారణ ప్రారంభమైంది. దేవుడి మాన్యాలపై నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన కలెక్టర్ల కమిటీ ఈ భూములకు సంబంధించిన కొత్త, పాత రికార్డులను తవ్వి తీస్తున్నది. దీంతో ఆక్రమణదారులకు బినామీలుగా ఉన్న నాయకులు/రియల్టర్ల వెన్నులో వణుకు మొదలైంది. కమిటీ సభ్యులు మేడ్చల్ జిల్లా పరిధిలోని మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో మొదటి సమావేశం నిర్వహించారు. అనంతరం రెవెన్యూ, ఎండోమెంట్ రికార్డులతోపాటు క్షేత్రస్థాయిలో ఎండోమెంట్ భూమిని పరిశీలించారు. ఐఏఎస్ అధికారుల కమిటీ నియామకం విషయం తెలుసుకున్న బినామీలు సోమవారం మధ్యాహ్నం నుంచి పత్తా లేకుండా పోయినట్టు మేడ్చల్ జిల్లాలో ప్రచారం జరుగుతున్నది.
బినామీలే కీలకం…
దేవరయాంజాల్ దేవాలయ భూముల ఆక్రమణదారుల్లో మాజీ మంత్రి ఈటల, ఓ ఎంపీ (టీఆర్ఎస్ కాదు) అనుచరులతోపాటు బడాబాబులున్నట్టు చెప్తున్నారు. కానీ వారెవ్వరూ తామే యజమానులమని ముందుకొచ్చే పరిస్థితి లేదు. అయితే వారికి బినామీలుగా ఉన్న వ్యక్తులు నెత్తికి చేతులు పెట్టుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ బాధలు మాకెందుకు.. విచారణ అధికారులకు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే ఈ గండం నుంచి బయటపడవచ్చని వారు అభిప్రాయపడుతున్నటు తెలిసింది. బినామీలుగా ఉన్నవారు ఏ చిన్న ఆధారం బయటపెట్టినా అక్రమంగా వెనకేసిన కోట్ల రూపాయల విలువైన భూములు కోల్పోవడం ఖాయం. బినామీలు నోరు తెరిస్తే.. మాత్రం తెరచాటు ఆక్రమణదారుల బండారం బయటకు రావడం ఖాయంగా కనిపిస్తున్నది. మాజీ మంత్రి ఈటలతోపాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఆక్రమణదారుల్లో ఉండటంతో వారు ఈటల పట్ల విపరీతమైన సానుభూతిని చూపుతున్నట్టు సానికులు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

