హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు గొల్లకురుమ (యాదవ) హకుల పోరాట సమితి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలిసారి గొల్లకురుమ వ్యక్తికి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు గొల్లకురుమల తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా, సామాజికంగా బీఆర్ఎస్తోనే గొల్ల కురుమలకు న్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ గొల్ల కురుమలకు రాజకీయ పదవులిచ్చి తమ గౌరవం పెంచారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.