ఇందిరమ్మ బిల్లు రాలేదని ఆగిన గుండె.. బేస్మెంట్ పూర్తయినా ఆర్నెల్లుగా రాని బిల్లు.. ఆగిన నిర్మాణం
ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదన్న గుబులుతో బీపీ ఎక్కువై గుండెపోటుతో ఓ లబ్ధిదారు మృతిచెందింది. కు టుంబసభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లికి చెందిన పానుగంటి మల్లు (58)కు ఒక్కడే కొడుకు. కుటుంబమంతా కూలి పనులు చేసుకొని బతుకుతుంటారు.
- గుండెపోటుతో మృతిచెందిన బాధితురాలు పానుగంటి మల్లు
- సొంతిల్లు లేక వాగు ఒడ్డున టెంట్ వేసి, దహన సంస్కారాలు
- కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిన ఘటన
- మంచిర్యాల జిల్లా వేంపల్లి గ్రామంలో దారుణం
మంచిర్యాల, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదన్న గుబులుతో బీపీ ఎక్కువై గుండెపోటుతో ఓ లబ్ధిదారు మృతిచెందింది. కు టుంబసభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లికి చెందిన పానుగంటి మల్లు (58)కు ఒక్కడే కొడుకు. కుటుంబమంతా కూలి పనులు చేసుకొని బతుకుతుంటారు. మల్లు పేరుపై ఇందిరమ్మ ఇల్లు మం జూరు కావడంతో అప్పు తెచ్చి, బంగారం కుదవపెట్టి బేస్మెంట్ వేసుకున్నారు. ఆగస్టులో ముగ్గుపోసి పిల్లర్లు తవ్వుకున్నారు. కానీ, వర్షాలకు గుంతలు మునిగిపోవడం తో హైట్ లేపి, సెప్టెంబర్ నెలాఖరుకు పిల్లర్లువేసి, బేస్మెంట్ నిర్మించారు. మట్టి పోసి పనులు చేయాల్సి రావడంతో 3 లక్ష లు ఖర్చు అయింది.
బేస్మెంట్ నిర్మించా క అధికారులు వచ్చి ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు యత్నించగా, లొకేషన్ మిస్ మ్యాచ్ అని తీసుకోలేదు. దీంతో కుంగిపోయిన మల్లు మూడు రోజు ల కిత్రం అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి, గుండెపోటులో చనిపోయింది. అద్దె ఇల్లు కావడంతో వేంపల్లి వాగు సమీపంలోనే టెంట్ వేసి మల్లు మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని సంబురపడితే.. చివరకు టెంట్ వేసి దహనసంస్కారాలు చేయాల్సి వచ్చిందంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఆరు నెలలైనా బిల్లు మంజూరు కాకపోవడం, లోకేషన్ మిస్ మ్యాచ్ సమస్య పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మల్లు చనిపోయిందని వాపోయారు.

15 రోజుల క్రితమే పరిష్కరించాం..
లొకేషన్ మిస్ మ్యాచ్ సమస్యతో మల్లుకు బిల్లు రాలేదు. కలెక్టర్‌కు ఈ విషయమై లెటర్ పెట్టారు. సమస్య పరిష్కారమైంది. పానుగంటి మల్లు ఫొటోలు తీసి అప్లోడ్ చేసి 15 రోజులు అవుతుంది. బిల్లు మంజూరైంది. ఆమె మరణానికి ఇందిరమ్మ ఇల్లు బిల్లుకు సంబంధం లేదు. కూలి పనికి వెళ్లిన సమయంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైనట్టు మాకు తెలిసింది.
-బన్సీలాల్, మంచిర్యాల జిల్లా హౌసింగ్ పీడీ
మా అమ్మకు వడదెబ్బ తగిలింది!
వీడియో విడుదల చేయించిన కాంగ్రెస్
ఇందిరమ్మ ఇంటికి బిల్లు రాలేదన్న గుబులుతో అనారోగ్యం పాలై, గుండెపోటుతో మల్లు మృతి చెందిందని కుటుంబసభ్యులే ఆదివారం దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో మీడియాకు చెప్పారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు రాత్రి బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడించి వీడియో, ప్రెస్‌నోట్ విడుదల చేయించారు. ఉదయం ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదన్న బాధతోనే అనారోగ్యం పాలైందని చెప్పిన కుటుంబసభ్యులతో, రాత్రి వడదెబ్బ తగిలిందంటూ వీడియో విడుదల చేయించారు. ఇది కాంగ్రెస్ దిగజారుడు, బెదిరింపు రాజకీయాలకు నిదర్శమంటూ స్థానికులు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

