అభ్యుదయవాది బసవేశ్వరుడు
- స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
- రవీంద్రభారతిలో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుక
- పాల్గొన్న రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ
రవీంద్రభారతి, మే 3: కుల, వర్ణ వ్యవస్థ, లింగ వివక్షను ఆనాడే వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వరుని 889వ జయంతి వేడుకలను మంగళవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సాంస్క్రృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి గౌరవించుకుంటున్నదని చెప్పారు.
లింగాయత్ ప్రజల ఆత్మగౌరవ భవనం కోసం కోకాపేటలో ఎకరం భూమితోపాటు రూ.10 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుని జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికుమార్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేందర్, శుభప్రద్ పటేల్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బీ శివకుమార్, భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సంగమేశ్వర్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బసవేశ్వరుని సందేశం ఆచరణీయం
మనుషులందరూ ఒకటే, కులాలు, ఉపకులాలు లేవన్న మహాత్మా బసవేశ్వరుని సందేశం ఆచరణీయమని ఢిల్లీ తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగాణభవన్‌లో సామాజిక వివక్షను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది, వీరశైవ మత స్థాపకుడు మహాత్మా బసవేశ్వరుని 889వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుని చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రతిఒకరూ బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నదని గౌవర్ ఉప్పల్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

