Basara IIIT | బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదలైంది. ఓపెన్ కేటగిరిలో 640 మంది విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 118 మంది, బీసీ కేటగిరిలో 346 మంది, ఎస్సీ కేటగిరిలో 178 మంది, ఎస్టీ కేటగిరిలో 119 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సీరియల్ నంబర్ 1 నుంచి 500 వరకు 7వ తేదీన, 501 నుంచి 1000 వరకు 8వ తేదీన, 1001 నుంచి 1404 వరకు 9వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. తదితర వివరాలు, జాబితా కోసం www.rgukt.ac.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.