Barrelakka | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష అందరి దృష్టి ఆకర్షించింది. నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా బరిలో నిలిచిన ఆమె పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాల్లో మాత్రం ప్రభావం చూపలేదు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే ఎక్కువగా బర్రెలక్క పాపులారిటీ సాధించినా ఓడిపోయింది.
బర్రెలక్కకు మొత్తం 5,754 ఓట్లు వచ్చాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో హేమాహేమీలు బరిలో ఉన్న చోట బర్రెలక్క ఎన్నికల బరిలో నిలవడంతో సోషల్ మీడియాలో మద్దతు లభించింది. శిరీష ఓడిపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.