రాష్ట్రంలో వెదురు సాగు పెంచాలి
రాష్ట్రంలో వెదురు సాగును పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం వెదురు సాగుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో
రైతులకు మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో వెదురు సాగును పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం వెదురు సాగుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో వెదురుకు భారీ డిమాండ్ ఉన్నదని, విద్యుత్తు ఉత్పత్తిలో బొగ్గుకు బదులుగా వెదురును విరివిగా ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ థర్మల్ విద్యుత్తు కేంద్రంలో 5 శాతం వెదురును వినియోగించాలని కేంద్రం ఆదేశించిందని గుర్తు చేశారు. ప్రతి రెండేండ్లకు పంట కోతకు వస్తుందని, 50 ఏండ్ల వరకు దిగుబడి ఉంటుందని వెల్లడించారు. 2 లక్షల ఎకరాల్లో వెదురు సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. లాభదాయకమైన వెదురు సాగుపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. సమీక్షలో ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అటవీ ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, వెదురు శాస్త్రవేత్త నంబీ భారతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

