Bakka Judson | ఒక మైనర్ అమ్మాయిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌరవుల్లా వేధిస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నాడని ఆరోపించారు. ఒక ఐపీఎస్ భార్యను చంపితే 48 గంటల్లో పోలీసులు పుణె వెళ్లి నిందితులను పట్టుకున్నారని అన్నారు. అలాంటిది ఇక్కడ ఉన్న వ్యక్తిని పట్టుకోలేరా అని ప్రశ్నించారు.
గతంలో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీని వేధిస్తే ఆమె ఇంగ్లండ్ పారిపోయి.. మమ్మల్ని వేశ్యలలాగా చూస్తున్నారని చెబితే అప్పుడు బీజేపీ ఒక్క మాట మాట్లాడలేదని తెలిపారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని పేర్కొన్నారు. బండి భగీరథ్ పోక్సో కేసుపై సిట్ విచారణ కాలయాపన కోసం వేశారని పేర్కొన్నారు. బండి భగీరథ్‌ను విచారణకు రమ్మని చెప్పి ఆయన రాకపోగా.. అసలు విచారణ అధికారులు కూడా రాలేదని అన్నారు.
మొన్న మోదీ టూర్లో బండి సంజయ్ పేరు తీసేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి నీకు నేను ఉన్నా అని తీసుకుపోయాడని బక్క జడ్సన్ తెలిపారు. బండి సంజయ్ కొడుకు రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని నాకు నిన్న పొద్దున ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు. బండి భగీరథ్ చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి రక్షణలో ఉన్నాడని.. పోలీసులే అతడిని రక్షిస్తున్నారు, కానీ పోలీసులకే అతను దొరకడం లేదని చెప్పారు. లోకల్ మీడియా ఒక బ్రోకర్ మీడియా అయిపోయిందని.. బండి సంజయ్ పోక్సో కేసు మీద ఒక్క వార్త కూడా వేయలేదని మండిపడ్డారు.
కొడుకుని కాపాడుకోడానికి బండి సంజయ్ డబ్బులను నీళ్ల లాగా ఖర్చుపెడుతున్నాడని బక్క జడ్సన్ మండిపడ్డారు. బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయమన్నందుకు నన్ను అరెస్ట్ చేసి వేధించారని తెలిపారు. ఇంకోసారి రేవంత్ రెడ్డికి, బండి సంజయ్ కి ఎవరు ఓటు వేయరని అన్నారు. రేపు బండి సంజయ్ మీద ఈ మైనర్ అమ్మాయి పోటీ చేస్తే అతను చిత్తు చిత్తుగా ఓడిపోతాడని అన్నారు.. అప్పుడు ఆమెనే ఈడ్చుకుపోయి జైలులో వేస్తుందని చెప్పారు.
V6 జర్నలిస్ట్ సంగప్పనే ఆ మైనర్ అమ్మాయి వీడియోలు మీడియాకి ఇచ్చాడని బక్క జడ్సన్ తెలిపారు. అసలు కేటీఆర్‌కు కాదు బండి సంజయ్ కొడుకుకు డ్రగ్స్ టెస్ట్ చేయించాలని విమర్శించారు.
ఇవాళ ఒక మైనర్ అమ్మాయిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌరవుల లాగా వేదిస్తున్నారు
రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్ కొడుకుని కాపాడుతున్నాడు
ఒక ఐపీఎస్ భార్యను చంపితే 48 గంటల్లో పోలీసులు పుణే వెళ్లి నిందితులను పట్టుకున్నారు.. అలాంటిది ఇక్కడ ఉన్న వ్యక్తిని పట్టుకోలేరా
గతంలో మిస్… pic.twitter.com/3o3RIuDvgx
— Telugu Scribe (@TeluguScribe) May 15, 2026