పారాచూట్ లీడర్ గిట్లనే ఉంటడు!
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ పారాచూట్ అభ్యర్థి, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రెండు రోజు ల క్రితమే రంగంలో దిగారు. నియోజకవర్గంతో ఏ మాత్రం సంబంధం లేని ఆయన మీడియాతో మాట్లాడే మాట లు కే.ఏ.పాల్‌ను గుర్తుకు తెస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
- అవగాహన లేమితో కామెడీ పండిస్తున్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతుంటాయి. అభ్యర్థులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాటు వ్యక్తిగత దూషణలకు దిగుతుండడం సర్వసాధారణం. ఎన్నికల ప్రచారం ఊపందుకునేకొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. అయితే, కొంతమంది నాయకులు, అభ్యర్థులు చేసే కామెంట్స్ కామెడీని పండిస్తుంటాయి. అలాంటి వారిలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్దే అందెవేసిన చేయి. సంబంధం లేని మాటలతో పాల్ ఇచ్చే హామీలు, మాట్లాడే మాటలు చాలామందికి నవ్వు తెప్పించేవిగా ఉంటాయి.
రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ సంబంధం లేని మాటలతో ఇచ్చే హామీలు, మాట్లాడే మాటలు చాలామందికి నవ్వు తెప్పిస్తాయి. అదే కోవలోకి వస్తాడు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. రోడ్లు బాగా లేవనే విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తాను ఫాలో అప్ చేసి సమస్యలు పరిష్కరిస్తానంటూ చెప్పడంతో తలలు పట్టుకోవడం ఆ పార్టీ కార్యకర్తల వంతయ్యింది.
– బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ పారాచూట్ అభ్యర్థి, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రెండు రోజు ల క్రితమే రంగంలో దిగారు. నియోజకవర్గంతో ఏ మాత్రం సంబంధం లేని ఆయన మీడియాతో మాట్లాడే మాట లు కే.ఏ.పాల్‌ను గుర్తుకు తెస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తొలిరోజు నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఎక్కడ జరుగుతుందని మీ డియా అడిగిన ప్రశ్నలకు మహబూబ్‌నగర్‌లో అంటూ జవాబు ఇవ్వడం అక్కడున్న కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. వాస్తవానికి సమావేశం యూసుఫ్‌గూడలోని మహమూద్ ఫంక్షన్ హాల్లో అని పక్కనున్న కార్యకర్తలు సర్దిచెప్పాల్సి వచ్చింది.
ఏం పనిచేయాలో తెలియదు..
నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం అనంతరం అజారుద్దీన్‌ను మీడియా ప్రతినిధులు పలకరించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని వారు అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలిన అజ్జూ భాయ్.. తాను నియోజకవర్గంలో పనిచేయడం కోసం వచ్చానని, ఏం పనిచేయాలో తెలియదు అంటూ చెప్పడంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.
రోడ్లు బాగా లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయండి
రోడ్లు బాగా లేకపోతే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మురుగు సమస్యలు ఉంటే జలమండలి అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఏదైనా నేరం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు మాత్రం ఇవన్నీ తెలియదు. నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిన ఆయనను అభివృద్ధి ఎలా ఉందని మీడియా ప్రశ్నించగా, తనకు అభివృద్ధి కనబడడం లేదని, రోడ్లు సరిగా లేవని, ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తాను ఫాలో అప్ చేసి సమస్యలు పరిష్కరిస్తానంటూ చెప్పడంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు తలలు పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

