గ్యాస్ లీకైందా.. గాబరా వద్దు!
చిన్న చిట్కాలతో ప్రమాదాల నివారణ
అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపకశాఖ

ఎల్పీజీ గ్యాస్‌కు సంబంధించి ఎలాంటి సహాయానికైనా 1906 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
హైదరాబాద్, ఏప్రిల్ 15, (నమస్తే తెలంగాణ): ఇంట్లో గ్యాస్‌లీకై అగ్నిప్రమాదం సంభ.వించిందా? గాబరాపడకుండా చిట్కాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని అగ్నిమాపకశాఖ చెప్తున్నది. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ చిట్కాలను సూచిస్తున్నది. ‘వండే పదార్థాలు పొంగి గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. వంట పూర్తయ్యేవరకు అక్కడే ఉండాలి. గ్యాస్‌స్టవ్, సిలిండర్, రెగ్యులేటర్‌లో ఇబ్బంది కలిగితే సొంత రిపేర్ వద్దు. గ్యాస్డీలర్ని సంప్రదించాలి. సిలిండర్‌కు అమర్చే ట్యూబ్(పైప్)లాగి చూసినప్పుడు పొడి రాలినా, చీలికలు కనిపించినా ఐఎస్ఐ మార్కు ఉన్న కొత్త రబ్బర్ ట్యూబ్‌ను అమర్చాలి. నిద్రించే ముందు రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. వంట గదిలో రిఫ్రిజరేటర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దు. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ను తప్పక ఆఫ్ చేయాలి.
గ్యాస్ లీక్ అయితే!
గ్యాస్ లీకైనట్టు గమనిస్తే వెంటనే రెగ్యులేటర్ వాల్వు ఆపేయాలి.
ఇంట్లో కరెంట్ స్విచ్‌లు ఆన్/ ఆఫ్ చేయవద్దు.
దేవుని వద్ద పెట్టిన దీపాలు, అగర్బత్తీలు ఆర్పివేయాలి.
గాలి, వెలుతురు కోసం కిటికీలు, దర్వాజాలు తెరవాలి.
ఎల్పీజీ డిటెక్టర్‌ని వంటగదిలో ఏర్పాటుచేసుకోవాలి. దీనిలో సెన్సర్లు గ్యాస్లీకైనట్టు గుర్తిస్తే అలారం మోగిస్తాయి.
అగ్ని ప్రమాదం సంభవిస్తే..
అవకాశం ఉంటే రెగ్యులేటర్ వాల్వ్ ఆఫ్ చేయాలి. అవకాశం లేకపోతే తడిపిన గోనె సంచిని గాని, తడి బట్టనుగాని మండుతున్న సిలిండర్‌పై వేయాలి, మంట ఆగిపోతుంది.
వెంటనే గ్యాస్ సిలిండర్‌ను ఖాళీ స్థలంలోకి తీసుకొచ్చి పెట్టాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- fire department
- gas
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

