హైదరాబాద్, మే 2: టెక్నాలజీ సేవల సంస్థ అవెవా.. హైదరాబాద్లో తాజాగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. భారత్లో తన వ్యాపారాన్ని విస్తరించేక్రమంలో ఇక్కడ సెంటర్ను నెలకొల్పింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు సెంటర్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ సెంటర్లో 1,200 మందికి పైగా టెక్నాలజీ నిపుణులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవెవా చీఫ్ కమర్షియల్ అధికారి స్యూ క్వెన్స్ మాట్లాడుతూ..అంతర్జాతీయ వ్యాపారంలో భారత్ చాలా కీలకంగా మారిందని, దీంతో ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ను నెలకొల్పాలని గతంలోనే నిర్ణయించినట్లు, దీనికి అనుగుణంగా ఇక్కడ సెంటర్ను ప్రారంభించినట్లు చెప్పారు.