ఐఐటీహెచ్‌లో అద్భుత ఆవిష్కరణలు
ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేస్తూ ఐఐటీ హైదరాబాద్ సత్తాచాటుతున్నది. ఐఐటీ హైదరాబాద్ పీహెచ్డీ స్కాలర్ ప్రియబత్ర రౌత్రే రూపొందించిన వ్యక్తిగత వైమానిక వాహనాల (పీఏవీ) డిజైన్లను శుక్రవారం ప్రదర్శించారు.
- వ్యక్తిగత వైమానిక వాహనాల డిజైన్ల ప్రదర్శన
- జూలై 4న అటానమస్ వెహికల్ సేవలు ప్రారంభం
సంగారెడ్డి, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేస్తూ ఐఐటీ హైదరాబాద్ సత్తాచాటుతున్నది. ఐఐటీ హైదరాబాద్ పీహెచ్డీ స్కాలర్ ప్రియబత్ర రౌత్రే రూపొందించిన వ్యక్తిగత వైమానిక వాహనాల (పీఏవీ) డిజైన్లను శుక్రవారం ప్రదర్శించారు. ప్రియబత్ర రెండేండ్లుగా పనిచేసి 400 డిజైన్లు సిద్ధం చేయగా, అందులో 28 ఎంపిక చేసి ప్రదర్శించారు. ఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ బీఎస్ మూర్తి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. రాబోయే కాలం వ్యక్తిగత వైమానిక వాహనాలదే అని ఆయన పేర్కొన్నారు. పీఏవీ తయారీకి అవసరమైన ఎయిరో డైనమిక్స్, మెటీరియల్, నావిగేషన్ సిస్టమ్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలు చేయనున్నట్టు చెప్పారు. ప్రదర్శనలో ఉంచిన 28 డిజైన్లలో నాలుగింటిని ఎంపిక చేసి వాటి ప్రోటో టైప్ డిజైన్లు తయారు చేస్తామని చెప్పారు. ప్రోటోటైప్ డిజైన్లు పూర్తయిన తర్వాత పీఏవీ తయారీపై పరిశోధనలు జరుగుతాయని వెల్లడించారు.
అటానమస్ వెహికల్ రెడీ
స్వయంప్రతిపత్తిగల(అటానమస్) ఎలక్ట్రిక్ వాహనాన్ని ఐఐటీ హైదరాబాద్ ఇటీవల తయారు చేసింది. జూలై 4న అటానమస్ వాహన సేవలను కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ప్రారంభించి, అదే వాహనంలో క్యాంపస్‌లో ప్రయాణిస్తారని ఐఐటీ వర్గాలు తెలిపాయి. ఐఐటీహెచ్ తయారుచేసిన అటానమస్ ప్యాసింజర్ డ్రోన్‌ను సైతం వారంరోజుల్లో పరీక్షించనున్నారు. బ్యాటరీ సాయంతో పనిచేసే అటానమస్ సైకిల్‌ను సైతం రూపొందించారు. సరికొత్త నావిగేషన్ ఇతర ఫీచర్స్‌తో ఐఐటీ హైదరాబాద్ రాబోయే ఆరు నెలల్లో అటానమస్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలు, నూతన ఆవిష్కరణల్లో ముందంజలో ఉన్నదని ఈ సందర్భంగా డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ దీపక్ మాథ్యూ, ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

