Srisailam | శ్రీశైలంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన భవనానికి రూ.కోటి విరాళం
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ మల్లికార్జున అన్నసత్ర సంఘం, ఆర్యవైశ్య సేవాధామం ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్యవైశ్య సంఘం నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ లక్ష్మీవెంకటేశ్ కుటుంబ సభ్యులు రూ. కోటి విరాళాన్ని అందజేశారు.
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ మల్లికార్జున అన్నసత్ర సంఘం, ఆర్యవైశ్య సేవాధామం ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్యవైశ్య సంఘం నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ లక్ష్మీవెంకటేశ్ కుటుంబ సభ్యులు రూ. కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గురువారం నిత్యాన్నదాన భవనం ప్రారంభ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో టీజీ వెంకటేశ్ మాట్లాడారు.

సేవా కార్యక్రమాలు చేసే వారికి తమ సహాయ సహాకారాలు ఉంటాయని అన్నారు. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రత్యేకంగా వివరించారు. ముఖ్యంగా యువత తప్పదోవ పడుతూ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని సూచించారు. టీజీ దంపతులు, ఆయన కుమారుడు టీజీ భరత్‌ను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, కమిటీ సభ్యులు సన్మానించారు. భవన నిర్మాణానికి గతంలో 50 లక్షలు ఇవ్వగా మిగతా మొత్తాన్ని చెక్కు రూపంలో గురువారం కమిటీకి అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

