ఆర్మూర్ అర్బన్ పార్క్ తెలంగాణకే తలమానికం : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఎంతో ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్ అర్బన్ పార్క్ తెలంగాణకే తలమానికం కానుందని పీయూసీ చైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడించారు.
ఆర్మూర్ : ఎంతో ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్ అర్బన్ పార్క్ తెలంగాణకే తలమానికం
కానుందని పీయూసీ చైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడించారు. ఆరు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఉన్న ఉన్న ఏకైక పార్క్ , తెలంగాణలోనే అతిపెద్ద వాచ్ టవర్ ను త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. నమస్తే నవనాధపురం కార్యక్రమంలో భాగంగా శనివారం మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామం వద్ద ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పార్క్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. అటవీశాఖ పర్యవేక్షణలో ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం జరుగుతున్నదన్నారు. మొత్తం 470 ఎకరాల్లో చేపట్టిన ఈ పార్క్ నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్కులో నిర్మాణం వంటి పనులకు ఇప్పటికే ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు జీవన్ రెడ్డి వివరించారు. ఈ నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు రుణపడి ఉంటామన్నారు.
మరో అయిదు కోట్ల రూపాయల ఖర్చుతో పార్కు సమీపంలో ఉన్న చిన్నపూర్ చెరువుతో పాటు గాజులకుంట, ఇనాయి కుంటలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. బోటింగ్ ఏర్పాటు, మినీ ట్యాంక్ బండ్ ల నిర్మాణం వంటి పలు పనులు చేపడతామన్నారు. 300ఎకరాల అటవీ విస్తీర్ణం స్పష్టంగా కనిపించేలా ఎతైన గుట్టపై 30ఫీట్ల ఎత్తులో వాచ్ టవర్ ను నెలకొల్పామని వెల్లడించారు. ఈ వాచ్ టవర్ లో మూడు ఫ్లోర్లు ఉన్నాయన్నారు.ఈ వాచ్ టవర్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దవుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

