కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
మేయర్ విజయలక్ష్మి | కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు.

హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు-10లోని పంచవటికాలనీని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి సందర్శించారు. కాలనీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడంలో స్థానికులను ఆమె అభినందించి కమిటీ ప్రతినిధులకు జీహెచ్ఎంసీ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
అనంతరం రోడ్డు నంబరు-7లోని గతి ప్రభుత్వ పాఠశాల గదుల్లో రసాయనాల పిచికారీని ఆమె పరిశీలించారు. ఇబ్రహీంనగర్‌లోని వ్యాక్సినేషన్ శిబిరాన్ని వారు సందర్శించారు. గతేడాది కరోనాతో కారణంగా చనిపోయిన ఉపాధ్యాయులు మాధవి, రాజ్‌కుమార్ కుటుంబాలను ఆదుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు మేయర్ దృష్టికి తెచ్చారు.
ఈ మేరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బస్తీల్లో, కాలనీలో ముమ్మరంగా చేపట్టిన వ్యాక్సినేషన్ శిబిరాలను స్థానికులు వినియోగించుకోవాలన్నారు. కొవిడ్ నివారణ చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు.
సెప్టెంబర్ ఒకటి నుంచి విద్యాసంస్థలు తెరుస్తున్న దృష్ట్యా విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, కాలనీవాసులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..
Kabul Blasts: శరీర భాగాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.. మురికి కాలువలో రక్తం పారింది!
Sonu Sood: సోనూ సూద్ విన్యాసాలని చూసి ముక్కున వేలేసుకున్న నెటిజన్స్
అసోంలో 7 వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

