Deputation | ఎస్టీ గురుకులంలో ఇష్టారీతిన డిప్యుటేషన్లు.. వార్డెన్లుగా కీలక సబ్జెక్టు టీచర్ల నియామకం
Deputation | ఎస్టీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన డిప్యుటేషన్లు కల్పిస్తున్నారు. కీలక సబ్జెక్టు టీచర్లను హాస్టల్ వార్డెన్లుగా నియమిస్తూ.. వారిస్థానంలో మళ్లీ కొత్తగా కాంట్రాక్టు సిబ్బందిని నియమిస్తున్న దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 29 మినీగురుకులాలు నిర్వహిస్తున్నది.
Deputation | హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఎస్టీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన డిప్యుటేషన్లు కల్పిస్తున్నారు. కీలక సబ్జెక్టు టీచర్లను హాస్టల్ వార్డెన్లుగా నియమిస్తూ.. వారిస్థానంలో మళ్లీ కొత్తగా కాంట్రాక్టు సిబ్బందిని నియమిస్తున్న దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 29 మినీగురుకులాలు నిర్వహిస్తున్నది. కేవలం గిరిజన బాలికల కోసమే వాటి ని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్నది. దాదాపు 21మినీ గురుకులాల్లో హెడ్ మిస్ట్రెస్ కమ్ వార్డెన్లు లేరు. ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ వాటి నియామకంపై దృష్టి పెట్టలేదు. ఇదే అదనుగా సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
నచ్చినవాళ్లకు, పైరవీలు చేసినవాళ్లకు మినీ గురుకులాల్లో డిప్యుటేషన్లు కల్పిస్తున్నారు. సొసైటీలో పనిచేసే టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్), పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్)లకు మినీగురుకులాల్లో డిప్యుటేషన్లు కల్పిస్తున్నారు. 17మందిని ఇప్పటికే ఇష్టారీతిన డిప్యుటేషన్లు కల్పించారు. వివిధ గురుకులాల్లోని కీలక సబ్జెక్టు టీచర్లకు వార్డెన్లుగా డిప్యుటేషన్ కల్పించడం సొసైటీలో చర్చనీయాంశంగా మారిం ది.
సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న, సొంత జిల్లాలకు చెందిన వారినే వారి సమీప ప్రాంతాలకు డిప్యుటేషన్ కల్పించడం గమనార్హం. మరోవైపు డిప్యుటేషన్‌పై వెళ్లిన టీచర్ల స్థానంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తూ ఆయా గురుకులాల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలకమైన సబ్జెక్టుల్లో వెనుకబడిపోతున్నారని స్వతహాగా ఆయా గురుకులాల టీచర్లే వెల్లడిస్తున్నారు. కీలక సబ్జెక్టు టీచర్లను వార్డెన్లుగా పంపడంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

