Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల.. జూన్ 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ
Basara IIIT | ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్‌ను బాసర ఆర్జీయూకేటీ బుధవారం విడుదల చేసింది. 6 ఏండ్ల ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 19వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు.
Basara IIIT | ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్‌ను బాసర ఆర్జీయూకేటీ బుధవారం విడుదల చేసింది. 6 ఏండ్ల ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 19వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు. పీహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా వారికి జూన్ 24 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. జూన్ 26వ తేదీన మెరిట్ జాబితాను విడుదల చేస్తామని బాసర ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు జులై 1న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి.
పదోతరగతిలో వచ్చే మార్కుల (జీపీఏ) ఆధారంగానే సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ తెలిపారు. 18 సంవత్సరాలు మించిన విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

