హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని డైట్ స్కూళ్లలో సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్ ఇన్డైట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీజీపీఎస్సీ) తెలిపింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీనియర్ లెక్చరర్ పోస్టులు (23), లెక్చరర్ ఇన్ డైట్(63) కలిపి మొత్తం 86 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది. ఈనెల 24 నుంచి వచ్చేనెల 29వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నది. అభ్యర్థుల అర్హతలు, పూర్తి వివరాలకు https://www.tgpsc.gov.in. వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.