హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనున్నది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 22 ఆఫీసర్ పోస్టులకు గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 3 నుంచి 24 వరకు దరఖాస్తు గడువు ఇచ్చింది. ఏప్రిల్ 4వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నది. దరఖాస్తు గడువు పొడిగింపు ఉండబోదని, అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. మరిన్ని వివరాలకు https://www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని పేర్కొన్నారు.