అడవుల్లో అగ్నిప్రమాదాలకు ఇక చెక్
అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో కలిసి దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ఎండీఏ) నిర్ణయించింది.
- ఉమ్మడి కార్యాచరణకు ఎన్ఎండీఏ నిర్ణయం
- అగ్నిమాపక నిర్వహణ బలోపేతంపై దృష్టి
- రాష్ర్టాల నుంచి ప్రతిపాదనలను కోరిన కేంద్రం
- ఇప్పటికే రూ.66.88 కోట్ల అంచనాతో పంపిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో కలిసి దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ఎండీఏ) నిర్ణయించింది. ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ప్రతిపాదనలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రతి రాష్ట్రం నుంచి రెండు లేదా మూడు జిల్లాల్లో అగ్నిప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై డీపీఆర్‌లు అందజేయాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ రూ.66.88 కోట్ల అంచనాతో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలను గుర్తించి, ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.
26 జిల్లాల్లో అగ్నిమాపక నిర్వహణ బలోపేతమే లక్ష్యం
దేశంలో అత్యధికంగా అటవీ అగ్ని ప్రమాదాలు జరిగే 26 జిల్లాల్లో అటవీ అగ్నిమాపక నిర్వహణను బలోపేతం చేయడంపై ఎన్ఎండీఏ దృష్టి సారించింది. ఈ మేరకు పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖల సహకారంతో ‘ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా’పై ఎన్ఎండీఏ ఇటీవల వర్క్‌షాప్ కూడా నిర్వహించింది. దీనిలో ఎకువగా అటవీ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న 11 రాష్ట్రాల్లో భవిష్యత్తులో ప్రమాదాలను నివారించడం, ఈ విపత్తుల పట్ల వేగంగా స్పందించడంపై దృష్టి సారించింది.
ఎంహెచ్ఏ, ఎన్డీఎంఏ, ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్ఎస్ఐ, ఐసీఎఫ్ఆర్ఈ, ఐజీఎన్ఎఫ్ఏతో పాటు 11 రాష్ర్టాల అటవీ శాఖలకు చెందిన వివిధ స్థాయిల అధికారులకు అటవీ అగ్ని శిక్షణ, అగ్ని హెచ్చరికలు, ముందస్తు హెచ్చరికలపై అవగాహన కల్పించారు. ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంచనా, సమస్యలు, సవాళ్లు, అటవీ అగ్ని నిర్వహణపై గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, కెపాసిటీ, ట్రైనింగ్ పరిమితులపై అవగాహన కల్పించారు. విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం, స్థానిక సమాజ ప్రమేయం, విపత్తు ప్రభావం తగ్గింపు కోసం సోషల్ మీడియాను ఉపయోగించడంపై అవగాహన కల్పించారు. 26 జిల్లాల డివిజనల్ ఫారెస్ట్ అధికారులతో చర్చలు కూడా జరిపారు. 2023 మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి అగ్నిప్రమాదాల నివారణకు తుది ప్రణాళికను ఖరారు చేస్తారని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

