‘కోర్’లో సీట్లకు కోత
ఇంజినీరింగ్ కోర్ బ్రాంచిల్లో ఈ ఏడాది మరో 9వేల సీట్లకు కోతపడనుంది. నిరుడు 5వేలకు పైగా సీట్లకు కోతపడగా, ఈ ఏడాది ఏకంగా 9వేల సీట్లు తగ్గనున్నాయి.
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్ బ్రాంచిల్లో ఈ ఏడాది మరో 9వేల సీట్లకు కోతపడనుంది. నిరుడు 5వేలకు పైగా సీట్లకు కోతపడగా, ఈ ఏడాది ఏకంగా 9వేల సీట్లు తగ్గనున్నాయి. ఈ సీట్లను కంప్యూటర్ సైన్స్ కోర్సు(సీఎస్ఈ) సీట్లుగా కన్వర్షన్ చేయబోతున్నారు. ఇవన్నీ సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ కోర్సులకు సంబంధించిన సీట్లే కావడం గమనార్హం. ఇందుకు ప్రభుత్వం ఆమోదిస్తే ఈ ఏడాది సీఎస్ఈ కోర్సులో 9వేలకు పైగా సీట్లు పెరగనున్నాయి.
అప్పిలేట్ కమిటీ 138 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చేందుకు పచ్చజెండా ఊపింది. నిరుడు 139 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలుండగా మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని మల్లారెడ్డి విద్యాసంస్థకు చెందిన ఒక కాలేజీని అదే విద్యాసంస్థకు చెందిన మరో కాలేజీలో విలీనంచేశారు. నిరుడు బాచుపల్లి సమీపంలోని డీఆర్కే కాలేజీని అదే విద్యాసంస్థకు చెందిన కాలేజీలో విలీనం చేశారు.
ఒక కాలేజీలో ఐటీ కోర్సులో 120 సీట్లుంటే 60సీట్లకు తగ్గించుకుని, మిగిలిన 60 సీట్లను కంప్యూటర్సైన్స్లో పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించారు. మరో కాలేజీలో ఎలక్ట్రికల్ బ్రాంచిలో 60 సీట్లుండగా, 30 సీట్లకు తగ్గించుకుని 30 సీట్లను కంప్యూటర్ సైన్స్ కోర్సుగా కన్వర్షన్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

