‘నెహ్రూ’ జంతువుల శ్మశానవాటిక!
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పారులో అరుదైన జంతుజాలాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం పిల్లల నుంచి పెద్దల దాకా లక్షలాది మంది సందర్శకులను అలరిస్తున్న జంతువుల వరుస మరణాలు అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నది.
- జూపారులో మరణ మృదంగం
- కిడ్నీవ్యాధులతో 60కి పైగా మృతి
- అవయవాలు చెడి తాబేలు మరణం
- తాజాగా రెండు కిడ్నీలు పాడై తెల్లపులి కన్నుమూత
- మీరాలం చెరువు నీరే కారణమన్న వైద్యులు
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పారులో అరుదైన జంతుజాలాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం పిల్లల నుంచి పెద్దల దాకా లక్షలాది మంది సందర్శకులను అలరిస్తున్న జంతువుల వరుస మరణాలు అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నది. కిడ్నీ వ్యాధులతోపాటు వివిధ అవయవాలు చెడి జూపార్కులోని పలు జంతువులు మృత్యువాత పడ్డాయి.
కిడ్నీవ్యాధులతోనే 60కి పైగా మరణించాయని జూపారు వెటర్నరీ వైద్యాధికారుల గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ప్రతీనెలా ఏదో ఒక జంతువు కిడ్నీ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మరణిస్తున్నది. దీనంతటికీ జూపార్కులోకి వచ్చే మీరాలం చెరువు కలుషిత నీరే కారణమని వైద్యులు తేల్చారు. ఆ చెరువు నీరు తాగడం వల్లే తరచూ జూపారు జంతువుల కిడ్నీలు దెబ్బతింటున్నాయని పశువైద్యాధికారుల పరీక్షల్లో తేలింది.
జంతువుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన మీరాలం చెరువు కలుషిత జలాలు జూపార్కులోకి రాకుండా నిరోధించడంలో రాష్ట్ర అటవీశాఖ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జూపారులో కలుషిత జలాలను శుద్ధి చేసేందుకు సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని జూపారు క్యూరేటర్ సిఫారసు చేసినా సరారు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాగే కలుషిత జలాలు వస్తుంటే భవిష్యత్తులో జూపారులో జంతువులన్నీ అంతర్థానం అయ్యే పరిస్థితులు నెలకొంటాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కనువిందు చేస్తున్న అరుదైన జంతువులు
నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో మొత్తం 2,240 జంతువులు ఉన్నాయి. వీటిలో 664 క్షీరదాలు, 97 రకాల 1,227 పక్షులు, 38 రకాలకు చెందిన 341 సరీసృపాలు, 8 ఉభయచరాలు ఉన్నాయి. బాతులు, కొంగలు, వివిధ రకాల రంగురంగుల పక్షులు, చిలుకలు, ఎతైన జిరాఫీలు, అడవిదున్నలు, చిరుతలు, పులులు, సింహాలు, తాబేళ్లు, కోతులు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.
పోస్టుమార్టం రిపోర్టులో తేలిన వాస్తవాలు
జూపారులో పలు జంతువులు మీరాలం చెరువు కలుషిత జలాలు తాగడం వల్లే వాటి కిడ్నీలు, ఇతర అవయవాలు చెడి మరణించాయని హైదరాబాద్ వెటర్నరీ కళాశాల పశుసంవర్థక శాఖ ప్రొఫెసర్లు స్పష్టం చేశారు. మంగళవారం జూపారులో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన అభిమన్యు అనే మగ తెల్లపులి రెండు కిడ్నీలు చెడి మరణించిందని పశు వైద్యాధికారుల పరీక్షల్లో తేలింది. గత మార్చి 15న జూపార్కు ప్రవేశ మార్గంలోనే సందర్శకులకు కనువిందు చేసిన 125 ఏండ్ల వయసున్న అరుదైన గాలాపాగోస్ జెయింట్ తాబేలు మృత్యవాత పడింది.
కిడ్నీతోపాటు ఇతర అవయవాల వైఫల్యం వల్లే ఆ తాబేలు మరణించిందని పశుసంవర్ధక శాఖ వైద్యులు, రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల బయోలాజికల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలూ తేల్చారు. మీరాల చెరువు నీటిలో నైట్రేట్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, కెమికల్స్, వివిధ రకాల మెటల్స్ ఉన్నాయని ల్యాబ్ పరీక్ష నివేదికల్లో వెల్లడైందని జూపారు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏ హకీం తెలిపారు. జూపారులో జంతువుల కోసం ఆర్వో వాటర్‌ప్లాంట్ నీటిని సరఫరా చేస్తున్నామని జూపారు ప్రజా పౌరసంబంధాల శాఖ అధికారి షేక్ హనీఫ్ తెలిపారు.
కాలుష్యం కాటు నుంచి కాపాడండి
జంతువులను కాలుష్యపు కాటు నుంచి కాపాడాల్సిన అవసరం ఉన్నది. పరిశ్రమల వ్యర్థ జలాల వల్ల మీరాలం చెరువు అత్యంత కాలుష్య కాసారంగా మారింది. జూపారు జంతువులు మరణించకుండా తెలంగాణ అటవీశాఖ అధికారులు ఇప్పటికైనా మేలుకోవాలి. కాలుష్యాన్ని నివారించేందుకు మున్సిపల్ శాఖ సత్వర చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ లూబ్నా సర్వత్, పర్యావరణ ప్రేమికురాలు, హైదరాబాద్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

