తెలంగాణలో అంగన్వాడీలకు సొంత భవనాల్లేవు
- వాటిని సమీప ప్రభుత్వ స్కూళ్లకు తరలించండి
- ఎంపీ పసునూరి ప్రశ్నకు కేంద్రమంత్రి సృ్మతి ఇరానీ సమాధానం
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 12,122 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేవని, అద్దె భవనాల్లో నడుస్తున్నాయని కేంద్రం తెలిపింది. అయితే వాటి నిర్మాణాలకు నిధులివ్వడం లేదని, సమీప ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని సూచించింది.
టీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఉపాధి హామీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఆర్ఐడీఎఫ్), ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం కింద నిధులు విడుదల చేశామని తెలిపారు. అద్దె భవనాల అంగన్వాడీలకు కనీస సౌకర్యాలు లేకుంటే దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలకు మార్చాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Anganwadis
- Buildings
- RIDF
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

