పోల్కంపల్లిలో పురాతన శిల్పాలు

- వెయ్యేళ్ల నాటి శిల్పాలను పరిరక్షించాలి
- పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి విజ్ఞప్తి
మహబూబ్నగర్, జూన్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో వెయ్యేళ్ల నాటి శిల్పాలను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ సీఈవో, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్ డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. గ్రామంలో ఎప్పటి నుంచో పూజలు అందుకొంటున్న కల్యాణ చాళుక్యుల కాలం నాటి నాగదేవతలు, నంది, వీరుల శిల్పాలు, రోడ్డు విస్తరణలో భాగంగా కనిపించకుండాపోయే ప్రమాదం ఉన్నదన్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ శిల్పాలతోపాటు ఆయుర్వేద మందులు నూరుకొనే సాన రాయి, గుండ్రని కల్వం కూడా ఉన్నట్టు తెలిపారు. చెరువు కట్టపైనున్న భైరవ, భైరవి, వీరభద్ర, సూర్య విగ్రహాలను కూడా పరిరక్షించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

