కంప్యూటర్ సైన్స్ సీట్లన్నీ ఫుల్
- సివిల్, మెకానికల్‌లో నిండింది 36 శాతమే
- ఎంసెట్ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి
- ఫీజు చెల్లించేందుకు 13 వరకు అవకాశం
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది కూడా ఎంసెట్ కౌన్సెలింగ్‌లో అత్యధిక శాతం విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సునే ఎంచుకొన్నారు. సీఎస్ఈ, ఐటీ తత్సమాన కోర్సుల్లో 98.49% సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈలో మొత్తం 18,682 సీట్లు ఉంటే 18,666 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 6 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. డాటా సైన్స్‌లో 99.64%, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్‌లర్నింగ్‌లో 98.97% సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసెట్ తొలి విడుత సీట్ల కేటయింపును సాంకేతిక విద్యాశాఖ అధికారులు మంగళవారం పూర్తిచేశారు. యూనివర్సిటీ కాలేజీల్లో 84.99%, ప్రైవేట్ యూనివర్సిటీల్లో 77.94%, ప్రైవేట్ కాలేజీల్లో 84.56% చొప్పున సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా తొలి విడతలో 84.45% సీట్లు భర్తీ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 4,943 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 13లోగా ఫీజు చెల్లించాలని, 17 నుంచి 21లోపు జిరాక్స్ సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించి రిపోర్ట్‌చేయాలని అధికారులు సూచించారు.
వందశాతం భర్తీ అయిన కోర్సులివే:
ఇంజినీరింగ్‌లో మొత్తం 45 రకాల కోర్సులుండగా, పలు కోర్సుల్లో వందకు వందశాతం సీట్లు నిండాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ట్ అండ్ టెలిమ్యాటిక్స్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెడ్ మాన్యుఫ్రాక్టరింగ్ సిస్టమ్స్, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో సీట్లు వందశాతం భర్తీ అయ్యాయి. మొదటి విడుతలోనే మొత్తం సీట్లు భర్తీకాగా, వీటిల్లో సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటం గమనార్హం. ఒక యూనివర్సిటీ కాలేజీ, 31 ప్రైవేట్ కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి.
కోర్ కోర్సులు ఢమాల్
ఇంజినీరింగ్‌లో కోర్ కోర్సు అయిన మెకానికల్, ఈఈఈ, సివిల్ ఇంజినీరింగ్ సీట్లకు రోజురోజుకు డిమాండ్ పడిపోతున్నది. ఈ మూడు కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తిచూపించడంలేదు. ఎంసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపులో మెకానికల్‌లో అతి తక్కువగా 31. 92% సీట్లు భర్తీకాగా, సివిల్ ఇంజినీరింగ్‌లో 36.38% సీట్లు మాత్రమే నిండాయి. ఇక ఈఈఈలో 56.49% సీట్లు నిండితే ఒక్క ఈసీఈలో మాత్రమే 92.13% సీట్లు నిండాయి. ఖాళీగా ఉన్న సీట్లలో ఈ మూడు బ్రాంచిలకు సంబంధించి సీట్లే అధికంగా ఉన్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని 23 లోకల్ బాడీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల..!
‘రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే అగ్రి షో’
Gold Price | ఒకేరోజు రూ.1400 తగ్గిన బంగారం ధర.. 1.86 లక్షలకు దిగొచ్చిన వెండి..!
Alias Rukmini | టాలీవుడ్ హీరో నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!
Aldas Janaiah | అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్డాస్ జానయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

