సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు!
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోఅధికారులకు ప్రభుత్వం వివిధ శాఖలను కేటాయించింది. ఈ శాఖల కేటాయింపు తక్షణం అమల్లోకి వస్తుందని ఆదేశాలు జారీచేసింది. ఇకపై అధికారులు తమకు కేటాయించిన శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు, ఫైళ్లను చూడనున్నారు.
- ఓవరాల్ ఇన్చార్జిగా ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోఅధికారులకు ప్రభుత్వం వివిధ శాఖలను కేటాయించింది. ఈ శాఖల కేటాయింపు తక్షణం అమల్లోకి వస్తుందని ఆదేశాలు జారీచేసింది. ఇకపై అధికారులు తమకు కేటాయించిన శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు, ఫైళ్లను చూడనున్నారు. సీఎంవో కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ వీ శేషాద్రికి అన్నింటిపై ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. పలు ముఖ్యమైన శాఖలనుకూడా ఆయనకు అప్పగించారు. సీఎంవోలోని అధికారులు.. వారికి కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి..
వీ శేషాద్రి, ప్రిన్సిపల్ కార్యదర్శి : జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, హోం, ఆర్థిక, ప్రణాళిక, న్యాయ, శాసన వ్యవహారాలు, ల్యాండ్ రెవెన్యూలతోపాటు సీఎంవో ఓవరాల్ ఇన్చార్జి. ఇతర అధికారుల పనులను పర్యవేక్షించడంతోపాటు సమన్వయం చేస్తారు. అలాగే మేజర్ పాలసీలకు సంబంధించి అధికారులందరూ ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చించాలి.
కే మాణిక్‌రాజ్, సెక్రటరీ : విద్యుత్తు, నీటి పారుదల, వి ద్యా (పాఠశాల, ఉ న్నత, సాంకేతిక వి ద్యా), రెవెన్యూ (కమర్షియల్ టాక్సెస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్), మైన్స్, జియాలజీ శాఖలు
షానవాజ్ ఖాసిం, సెక్రటరీ: బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షే మం, డిజాస్టర్ మేనేజ్మెంట్, క్రీడలు, యువజన సర్వీసులతోపాటు సీఎం సెక్యూరిటీ.
ఎస్ సంగీత సత్యనారాయణ, జాయిం ట్ సెక్రటరీ: వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖలు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమంతోపాటు సీఎం కార్యాలయం నిర్వహణ (సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా).
డాక్టర్ జీ చంద్రశేఖర్‌రెడ్డి, సెక్రటరీ: పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖలు, వ్యవసాయం, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, సహకార, మార్కెటింగ్, ఆహార – పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, రవాణా, రోడ్లు, భవనాలు, హౌసింగ్ శాఖలు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (ఆర్డబ్ల్యూఎస్).
బీ అజిత్‌రెడ్డి, స్పెషల్ సెక్రటరీ: మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు (మౌలిక సదుపాయాలు, పెట్టబడులు), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ – కమ్యూనికేషన్, కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీ, సమాచార శాఖలతోపాటు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ విభాగాలు.
వేముల శ్రీనివాసులు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ: దేవాదాయ, సంస్కృతి, పర్యాటకంతోపాటు సీఎంకు వచ్చే పిటిషన్లు, ప్రజావాణి, సీఎంఆర్ఎఫ్ (సీఎంవో స్పెషల్ సెక్రటరీ ద్వారా), సీఎంవో కంప్యూటరైజేషన్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

