అక్రమాల ములాఖత్!
వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలులో ములాఖత్ పేరిట ఖైదీలు, వారి కుటుంబసభ్యుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి చర్లపల్లి జైలుకు పంపించాలని ఆదేశాలు వచ్చాయని.. ఇదే జైలులో ఉండాలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందేనంటూ భయపెడుతూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం రిమాండ్, అండర్ ట్రయల్ ఖైదీలకు నెలకు నాలుగుసార్లు, శిక్ష పడిన ఖైదీలకు నెలకు రెండు సార్లు ములాఖత్లుంటాయి.
- ఖైదీలను కలువాలంటే చేతులు తడుపాల్సిందే
- డబ్బులిచ్చిన వారికి రాచమర్యాదలు
- పరిగి సబ్‌జైలుపై విమర్శలు
వికారాబాద్, అక్టోబర్ 22, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలులో ములాఖత్ పేరిట ఖైదీలు, వారి కుటుంబసభ్యుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి చర్లపల్లి జైలుకు పంపించాలని ఆదేశాలు వచ్చాయని.. ఇదే జైలులో ఉండాలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందేనంటూ భయపెడుతూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం రిమాండ్, అండర్ ట్రయల్ ఖైదీలకు నెలకు నాలుగుసార్లు, శిక్ష పడిన ఖైదీలకు నెలకు రెండు సార్లు ములాఖత్లుంటాయి.
ఈ విషయం తెలియకపోవడంతో సంబంధిత ఖైదీల కుటుంబసభ్యులు, బంధువులు కలిసేందుకు రాగా.. ములాఖత్‌కు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఖైదీలు, వారి బంధువుల నుంచి వసూలు చేసే డబ్బుల విషయంలోనూ సంబంధిత జైలర్ ఎక్కడా దొరుకకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. నగదు, లేదంటే వేరే వాళ్ల నంబర్‌కు ఆన్లైన్లో పంపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఇటీవల ఓ ఖైదీని చర్లపల్లి జైలుకు తరలించాలని ఆదేశాలొచ్చాయని రూ.90 వేలు, ములాఖత్ పేరిట రూ.30 వేలకుపైగా వసూలు చేసినట్టు సమాచారం. సదరు జైలరే చర్లపల్లి తరలించాలని ఓ లెటర్ తయారు చేసి ఖైదీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
గాంధీజీ లాంటి జయంతి కార్యక్రమాలకు స్వీట్ బాక్సులకు డబ్బులు సైతం ఖైదీల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం. జైలర్ అడిగినంతా ముట్టజెప్పితే సదరు ఖైదీలను వారి కుటుంబసభ్యులు, బంధువులు ఎన్నిసార్లు అయినా కలిసే అవకాశం కల్పిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. అట్రాసిటీ కేసులో ఇటీవల జైలుకెళ్లిన ఓ పార్టీ నాయకుడి నుంచి జైలుకు ఫ్రిడ్జ్ కావాలంటూ తెప్పించి తన ఇంటికి కొత్తది తీసుకెళ్లి, పాత ఫ్రిడ్జ్‌ను జైలులో పెట్టించినట్టు తెలిసింది. ఖైదీలను కలిసేందుకు వచ్చేవారి కుటుంబసభ్యుల నుంచి జైలర్ ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులను తెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖైదీలకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, నీళ్ల చారుతో సరిపెడుతూ నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారని తెలిసింది. జైలులో సొంతంగా నాటు కోళ్లను పెంచుతూ వాటికి దాణా వేయడంలాంటి పనులు చేసేందుకు రోజుకు ముగ్గురు ఖైదీలకు బాధ్యతలు ఇచ్చినట్టు సమాచారం. జైలర్ అక్రమ వసూళ్ల పై ఉన్నతాధికారులు విచారణ జరుపాలని ఖైదీలు, కుటుంబసభ్యులు కోరుతున్నారు. సదరు జైలర్‌ను వివరణ కోరగా.. వసూళ్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

