కొండపై ఉన్నావమ్మా అమ్మా దుర్గమ్మా..
‘బెజవాడ కనకదుర్గమ్మకు మా నాన్న ఈవీవీ సత్యనారాయణ పరమభక్తుడు. ఎన్నో డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేసిన నేనూ.. తొలిసారి చేస్తున్న భక్తిరసాత్మక చిత్రం దుర్గమ్మది అవ్వడం, ఆ సినిమా పేరు ‘కనకదుర్గ’ కావడం నా అదృష్టం. నవరాత్రుల్లో ఎక్కడ విన్నా మార్మోగిపోయేలా ఓ పాటను కంపోజ్ చేయాలని తమన్‌కి చెప్పాను. ఆయన అద్భుతమైన పాటను అందించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మీ ముందుకొస్తాం’ అని అల్లరి నరేశ్ అన్నారు.
‘బెజవాడ కనకదుర్గమ్మకు మా నాన్న ఈవీవీ సత్యనారాయణ పరమభక్తుడు. ఎన్నో డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేసిన నేనూ.. తొలిసారి చేస్తున్న భక్తిరసాత్మక చిత్రం దుర్గమ్మది అవ్వడం, ఆ సినిమా పేరు ‘కనకదుర్గ’ కావడం నా అదృష్టం. నవరాత్రుల్లో ఎక్కడ విన్నా మార్మోగిపోయేలా ఓ పాటను కంపోజ్ చేయాలని తమన్‌కి చెప్పాను. ఆయన అద్భుతమైన పాటను అందించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మీ ముందుకొస్తాం’ అని అల్లరి నరేశ్ అన్నారు. ఆయన నటిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘కనకదుర్గ’. కాజల్ చౌదరి కథానాయిక. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రచయిత బీవీఎస్ రవి కథను అందించి, అజిత్ ఠాకూర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని తొలిపాట ‘అమ్మ.. కనకదుర్గ’ను విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో అల్లరి నరేశ్ మాట్లాడారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. ‘కొండపై ఉన్నావమ్మా అమ్మా దుర్గమ్మా.. అండగా నీడై ఉండే సాయం నీదమ్మ.. ఓయమ్మో పెద్దపులి ఎక్కే మాయమ్మ.. శూలమే తిప్పుతున్న శక్తే నీవమ్మ..’ అంటూ సిరాశ్రీ రాయగా, తమన్ స్వరపరచిన ఈ పాట అమ్మవారి దివ్యానుగ్రహం, శక్తి, ఆధ్యాత్మికత విశిష్టతను చాటిచెప్పేలా సాగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

