Ajmera Sanketh Kumar | కోచింగ్ లేకుండానే విజయం.. సివిల్స్ 35వ ర్యాంకర్ సంకేత్ స్పెషల్ ఇంటర్వ్యూ
Ajmera Sanketh Kumar | సివిల్స్-2022 ఫలితాల్లో గిరిజన ఆణిముత్యం అజ్మీరా సంకేత్‌కుమార్ ఆలిండియా 35వ ర్యాంకు సాధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ అనేక గిరిజన తండాలు నాగరికతకు దూరంగా బతుకున్నాయని సంకేత్ ఆవేదన వ్యక్తం చేశారు
Ajmera Sanketh Kumar | హైదరాబాద్: సివిల్స్-2022 ఫలితాల్లో గిరిజన ఆణిముత్యం అజ్మీరా సంకేత్‌కుమార్ ఆలిండియా 35వ ర్యాంకు సాధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ అనేక గిరిజన తండాలు నాగరికతకు దూరంగా బతుకున్నాయని సంకేత్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గిరిజన తండాల్లో చైతన్యం నింపేందుకు కృషి చేస్తానని చెప్తున్నారు. తన తల్లిదండ్రుల స్ఫూర్తితోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించానని అంటున్న సంకేత్ కుమార్‌తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ…
అమ్మానాన్నలే నాకు స్ఫూర్తి
మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి. అమ్మ సవిత ఇస్రోలో ఉద్యోగం చేస్తారు. నాన్న ప్రేమ్‌సింగ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్. నాకు మా అమ్మనాన్నలే రోల్‌మాడల్. వాళ్లలానే ఉన్నతస్థాయికి ఎదగాలని ప్రతిక్షణం పరితపించాను. చివరికి సివిల్స్‌కు ఎంపికయ్యాను. ఈ క్షణం మా అమ్మానాన్నల కళ్లలో చూసిన ఆనందమే నా విజయానికి ప్రతీక. సివిల్స్‌లో ర్యాంకు సాధిస్తాననే నమ్మకం నాకు మొదటి నుంచే ఉంది. కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌కు సొంతగా ప్రిపేర్ అయ్యా. మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనుదిరిగినా.. అయినా వెనుకడుగు వేయకుండా మొదటిసారి ఎక్కడ పొరపాటు జరిగిందో ఒకటికి పదిసార్లు ఆలోచించా. రెండోసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలనే దృఢ సంకల్పంతో ప్రిపేర్ అయ్యా. 35వ ర్యాంకు సాధించా.
రిసెర్చ్ అంటే ఇష్టం..
అమ్మానాన్నల ఉద్యోగరీత్యా మేం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. హైదరాబాద్‌లోని భాష్యం పబ్లిక్ స్కూల్లో 2011లో పదో తరగతి పూర్తయ్యింది. ఫిట్(ఎఫ్ఐఐటీ) జేఈఈ సైఫాబాద్ బ్రాంచ్‌లో 2013లో ఇంటర్మీడియట్ పూర్తి చేశా. దిల్లీ ఐఐటీలో 2017లో బీటెక్ పట్టా తీసుకున్నా. నాకు మొదటి నుంచి రిసెర్చ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే.. ఆ తర్వాత జపాన్‌లో రిసెర్చింగ్లో ఉద్యోగం చేశా. కానీ సంతృప్తి కలుగలేదు. అందుకే.. సివిల్స్ సాధించాలని నిర్ణయించుకున్నాను. అమ్మానాన్న కూడా ఓకే అనేశారు. వెంటనే సివిల్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మానసిక ప్రశాంతత కోసం హాకీ, బ్యాడ్మింటన్ ఆడేవాడిని. చివరిగా.. ‘చాలా మంది ప్రతిభావంతులు పోటీ పడే పరీక్ష ఇది. అందుకే.. ప్రతిక్షణం ఎంతో ముఖ్యం. అలాగని గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన పనిలేదు. ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు.. ఏం చదువుతున్నాం, ఎలా చదువుతున్నామన్నదే ముఖ్యం. చదువుతున్నంత సేపు శ్రద్ధపెడితే విజయం మీ సొంతం అవుతుంది.’
సమాజాన్ని చదివా
సివిల్స్ అనగానే ఎక్కువ మంది రోజుకు 12 నుంచి 16 గంటలు చదవాలని భ్రమపడుతూ ఉంటారు. ఎక్కువ పుస్తకాలు చదివెయ్యాలని తాపత్రయ పడుతూ ఉంటారు. కానీ.. సివిల్స్ సాధించాలంటే ముందు చదవాల్సింది సమాజాన్ని. నేను అందులో సక్సెస్ అయ్యాను. పుస్తకాలతోపాటు సమాజంపై ఎక్కువ అధ్యయనం చేశాను. ప్రతి అంశాన్ని ప్రస్తుతంతో ముడిపెడుతూ అర్థం చేసుకుంటూ, అవకాశం దొరికితే స్నేహితులతో చర్చించేవాడిని. దీనివల్ల.. చదివినది తొందరగా వంట పట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

