నూతన సాగుకు అండ అగ్రిహబ్

నేడు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభం
వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 29: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏజీహబ్-అగ్రి ఇన్నొవేషన్ హబ్ సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నది. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు సమక్షంలో మంత్రి నిరంజన్‌రెడ్డి అగ్రిహబ్‌ను ప్రారంభించనున్నారు. వ్యవసాయరంగంలో ఇన్నొవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు ఇటువంటి హబ్ ఏర్పాటుకావడం దేశంలోనే మొదటిసారి అని వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు తెలిపారు. దీని ఏర్పాటులో నాబార్డ్ అండగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనున్న హబ్ సేవలను గ్రామీణ ప్రాంతాల రైతులకు చేరువచేసేందుకు జగిత్యాల, వరంగల్, వికారాబాద్‌లో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అగ్రిహబ్‌ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. గ్రామీణయువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు గ్రంథాలయంగా ఉపయోగపడుతుంది. నాణ్యతగల విత్తనాలు, మొక్కలకు కావల్సిన ఎరువులు, పురుగుమందులు, పంట దిగుబడి తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

