TSLPRB | 14 నుంచి పోలీసు ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్.. ఈ ధృవపత్రాలు తప్పనిసరి
TSLPRB | హైదరాబాద్ : తెలంగాణలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవలే తుది రాతపరీక్షల ఫలితాలు విడుదల కాగా, ఈ నెల 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 11 రోజుల పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది.
TSLPRB | హైదరాబాద్ : తెలంగాణలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవలే తుది రాతపరీక్షల ఫలితాలు విడుదల కాగా, ఈ నెల 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 11 రోజుల పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది. తుది రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్ నుంచి ఇంటిమేషన్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు సూచించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్న ఇంటిమేషన్ లెటర్‌ను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా చూపించాలని బోర్డు సూచించింది. ఇంటిమేషన్ లెటర్ జూన్ 11 ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రంలోనే అప్లికేషన్ ఎడిటింగ్/మాడిఫై చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు బోర్డు తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా మార్కుల వెయిటేజీ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్టీఏ ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాలని కోరింది. వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం (జూన్ 2, 2014 తర్వాత), బీసీ అభ్యర్థులు నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్ (2021 ఏప్రిల్ 1 తర్వాత), ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు (2021 ఏప్రిల్ 1 తర్వాత), ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు ఒరిజినల్స్, జిరాక్స్‌ల సెట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించింది. వీటితో పాటుగా ఇంటిమేషన్ లెటర్, ట్రాన్సాక్షన్ ఫామ్, పార్ట్-2 అప్లికేషన్ ప్రింట్ అవుట్, ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, ఏజ్ రిలేటెడ్, లోకల్ కాండిడేచర్ రిలేటెడ్, రిజర్వేషన్ బెనిఫిట్ రిలేటెడ్, ఏజ్ రిలాక్షేషన్, డ్రైవింగ్ లైసెన్స్, హారిజంటల్ రిజర్వేషన్ బెనిఫిట్స్ రిలేటెడ్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని బోర్డు సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

