Advisor | ‘ఆత్మ’గా ఆ అడ్వెజర్.. పాలనలో ఆయనదే హల్చల్!
ప్రభుత్వంలోని ఒక అడ్వైజర్ ‘ఆత్మ’గా చెలామని అవుతున్నారా? నాడు కేవీపీ పోషించిన పాత్రను ఇప్పుడు ఈ అడ్వైజర్ పోషిస్తున్నట్టు భావిస్తున్నారా? అంటే అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. పాలనాపరమైన వ్యవహారాల్లో సదరు సలహాదారు మంత్రులను మించి హల్చల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఏదైనా పని కావాలంటే.. సలహాదారును కలిశావా? అనే స్థాయికి పరిస్థితి చేరింది.
- కేవీపీతో పోల్చుతున్న వైనం
- ఇంటికి క్యూ కడుతున్న బడా నేతలు, దళారులు, ఉన్నతాధికారులు
Advisor | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలోని ఒక అడ్వైజర్ ‘ఆత్మ’గా చెలామని అవుతున్నారా? నాడు కేవీపీ పోషించిన పాత్రను ఇప్పుడు ఈ అడ్వైజర్ పోషిస్తున్నట్టు భావిస్తున్నారా? అంటే అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. పాలనాపరమైన వ్యవహారాల్లో సదరు సలహాదారు మంత్రులను మించి హల్చల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఏదైనా పని కావాలంటే.. సలహాదారును కలిశావా? అనే స్థాయికి పరిస్థితి చేరింది. ప్రభుత్వంలో కీలక వ్యక్తికి అత్యంత సన్నిహితుడు కావడంతో సొంత పార్టీ నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు, ఉన్నతాధికారులు సైతం ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. రాజకీయ నేతలు టికెట్లు, పదవుల కోసం పైరవీలు చేస్తుంటే, అధికారులు బదిలీలు, పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వంలోని కీలక వ్యక్తి అపాయింట్మెంట్ కావాలంటే ముందు గా ఆ అడ్వైజర్‌ను కలవాల్సిందేనని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తితో ఏదైనా పర్సనల్‌గా మాట్లాడాలనుకుంటే ఎ ప్పుడూ ఆ సలహాదారు వెన్నంటే ఉంటున్నారట.
దీంతో మంత్రులు కూడా తమ అభిప్రాయాలను చెప్పలేని, తమ కోసం ఏదైనా అడగలేని పరిస్థితి నెలకొన్నదట. ఆ సలహాదారు వ్యవహారం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ కోసం త్యాగాలు చేసింది, కష్టపడ్డది తామైతే ఇప్పుడొచ్చిన ఆయన పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నారట. ఇటు ప్రభుత్వంలో అ టు పార్టీలో ఆయన పవర్‌సెంటర్‌గా మారిపోయారని మండిపడుతు న్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈయనను ప్రసన్నం చేసుకునేందుకు ఒక పెద్ద అధికారి పడ్డపాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆయనకు వాస్తవానికి ఐదో ఫ్లోర్లో చాంబర్ కేటాయించారు. కానీ, ఆ ఉన్నతాధికారి మాత్రం ఆయనను మరో ఫ్లోర్ ఎక్కించి తన స్వామిభక్తిని ప్రదర్శించుకున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందరూ తనను కలుస్తుండటం చివరకు ఎక్కడకు దారితీస్తుందోనని సదరు సలహాదారు కూడా ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. అందరూ తనవల్ల పనులవుతాయని భావించి వస్తున్నారని, కానీ, తనతో ఏ పనీ అయ్యే పరిస్థితి లేదని ఆయన వాపోతుండటం కొసమెరుపు. ఆ అడ్వైజర్ చేస్తున్న వ్యవహారాలు ప్రభుత్వ పెద్ద దృష్టికి పలువురు తీసుకెళ్లినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ పెద్ద ‘ఓహో అప్పుడే ఎల్లో చిట్టీలు’ (గతంలో వైఎస్ హయాంలో ప్రధాన ఐడ్వెజర్ ఇలాగే పసుపురంగు చిట్టీలపై రాస్తే రికమెండేషన్లు చెల్లేవి) రాసే వరకు వెళ్లిందా వ్యవహారం? ఆయనేమైనా ‘ఆత్మ’ అనుకుంటున్నారా ఏమిటి? ఏం చేయాలో నాకు తెలుసులే. ఎప్పుడు ఒత్తాలో అప్పుడు ఒత్తుతా’ అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

