అడ్వెంచర్ టూరిజం @ అనంతగిరి

200 కోట్లతో భారీ ప్రాజెక్టు
ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలకు నిలయమైన అనంతగిరి హిల్స్ అడ్వెంచర్ టూరిజంకు చిరునామాగా మారనున్నది. రూ.200 కోట్లతో అక్కడ సాహస పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గుర్రపు స్వారీ, డిర్ట్ బైక్స్, సైకిల్ ట్రాక్, జిప్ లైన్స్, నేచర్ ట్రెకింగ్ తదితరాలతో భారీ ప్రాజెక్టును నెలకొల్పేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో 1,500 మందికి ఉపాధి లభించనున్నది. అనంతగిరి హిల్స్‌లో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధిపై ఎంఎం సిటీ సంస్థ ఇటీవలే పర్యాటక శాఖకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ సంస్థ ప్రతిపాదనల మేరకు పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌రావు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం రెండు మూడు రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లనుంది. ఈ బృందం ఇచ్చే నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ‘సమస్తే తెలంగాణ’కు తెలిపారు. అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయని, అనంతగిరిని అద్భుతమైన అడ్వెంచర్ టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adventure
- anathagiri
- Tourism
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

