ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట..!
ఆదిలాబాద్ రిమ్స్ విషాదకర ఘటనపై విచారణ కమిటీ 50 పేజీల నివేదిక.. సర్కార్ నిర్లక్ష్యం, లోపాలు బయటపడకుండా ఎలుకలపైకి నెపం
మంచిర్యాల (నమస్తే తెలంగాణ), అక్టోబర్ 13: ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలోని నవజాత శిశువుల సంరక్షణ విభాగానికి (ఎస్ఎన్సీయూ) చెందిన ఏసీ వైర్లను ఎలుకలు కొరుకడంతో ప్రమాదం జరిగి, ఐదుగురు పిల్లులు మృతి చెందారని కాంగ్రెస్ సర్కార్ సిగ్గులేకుండా ప్రకటించి, చేతులు ఎత్తేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 21న అర్ధరాత్రి రిమ్స్ దవాఖాన ఎస్ఎన్సీయూ వార్డులో 27 మంది పసికందులు చికిత్స పొందుతుండగా, షార్ట్ సర్యూట్ జరిగి దట్టమైన పొగల్లో ఊపిరి ఆడక ఐదుగురు పసికందులు ప్రాణాలు కోల్పోవడంతో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం నవజాత శిశువుల ప్రాణాలను బలిగొందంటూ యావత్ తెలంగాణ సమాజం దుమ్మెత్తి పోసింది.
ఈ ఘటనపై సర్కార్ నియమించిన ఆరుగురు సభ్యుల హైలెవల్ కమిటీ ఏసీ వైర్లను ఎలుకలు కొరుకడంతో ప్రమాదం సంభవించిందని 50 పేజీలతో కూడిన నివేదికను అందజేసినట్టు తెలిసింది. సర్కార్ అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి ఎలుకలపై నెపం నెడుతూ నివేదిక ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలకు చికిత్స అందించే బ్లాక్‌లో ఎలుకలు తిరుగుతుంటే దవాఖాన సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదానికి ఎలుకలే కారణమని ఎలా ధ్రువీకరించారు.. సర్కార్‌కు అందజేసిన నివేదిక బయటికి రాకుండా ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు.. అన్న ప్రశ్నలకు సర్కార్ సమాధానం చెప్పకుండా తప్పించుకునే కుట్రలు చేస్తున్నది.
చిన్నారుల మృతికి ఎలుకలను బాధ్యులను చేస్తూ ..అసలైన దోషులను తప్పించే యత్నం చేస్తున్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్‌ఎన్‌సీయూలో 27 మంది చిన్నారులు ఉండగా గంటల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు, చికిత్స పొందుతూ మరో ఇద్దరు చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దవాఖానను సందర్శించి విచారణ కమిటీ వేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మకరందు చైర్మన్‌గా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది, రోగుల బంధువులతో పాటు పలువురిని పిలిపించుకుని ప్రమాద ఘటనపై వివరాలు సేకరించింది.
ఎస్ఎన్సీయూ వార్డుతో పాటు దవాఖానను పరిశీలించి, ప్రమాద సమయంలో విధుల్లో ఎంత మంది ఉన్నారు, ఎవరు ఏ పనిచేశారనే విషయాలతో కూడిన 50 పేజీల నివేదికను ప్రభుత్వానికి పదిరోజుల కిందటే అందజేసినట్టు తెలిసింది. ఏసీకి సంబంధించిన వైర్లను ఎలుకలు కొరికివేయడంతోనే ప్రమాదం జరిగినట్టుగా తేల్చినట్టు తెలిసింది. నవజాత శిశువులు ఉండే వార్డులోకి ఎలుకలు ఎలా ప్రవేశించాయనే విషయాన్ని పరిశీలిస్తే.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నదని బాధితులు తెలిపారు. ప్రమాదం జరిగిన వార్డులో నాలుగు ఏసీలు ఉండగా వాటి నిర్వహణను సిబ్బంది గాలికి వదిలేసినట్టు ఆరోపించారు.
ఏసీల్లో గ్యాస్ వ్యవస్థ సరిగా లేకపోవడంతోపాటు లోడ్ ఎక్కువ కావడం వల్ల అవి పేలిపోయినట్టు ప్రాథమిక సమాచారం. ఇంతమంది సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్టు స్పష్టమవుతున్నా విచారణ కమిటీ మాత్రం దోషులను తప్పించడానికే మూగజీవాలపై నేరం మోపడానికి సిద్ధమైందని బాధితులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. కమిటీ విచారణ పూర్త యి ప్రభుత్వానికి నివేదిక పంపి పదిరోజులు కావస్తున్నా ప్రమాదానికి గల కారణాలు, ఎవరు బాధ్యలనే దానిపై ఇంతవరకూ వెల్లడించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వెంటనే విచారణ కమిటీ నివేదికను బహిర్గతం చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

