Acharya Ravva Srihari | సుప్రసిద్ధ సాహితీవేత్త, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ద్రావిడ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య రవ్వా శ్రీహరి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రవ్వా శ్రీహరి నిన్న రాత్రి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవ్వా శ్రీహరి మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు, రచయితలు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు అని సాహితీవేత్తలు పేర్కొన్నారు.